హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్ షో - జన సంద్రమైన ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసరాలు - తెలంగాణలో ప్రధాని మోదీ రోడ్ షో
🎬 Watch Now: Feature Video
Published : Nov 27, 2023, 6:36 PM IST
PM Modi Road Show in Hyderabad : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ప్రారంభమైన రోడ్ షో.. నారాయణగూడ, వైఎంసీఏ, కాచిగూడ చౌరస్తాలోని వీర సావర్కర్ విగ్రహం వరకు సాగింది. 2 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్ షోలో.. ప్రధాని మోదీని చూసేందుకు బీజేపీ, జనసేన, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మోదీని చూసేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి చేరుకున్నారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వరకు పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. రోడ్ షోను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ముందుగానే ఆ రూట్లలో బస్సులను డైవర్ట్ చేసింది. ట్రాఫిక్ పోలీసులు రోడ్ షోకు 2 గంటల ముందుగానే ట్రాఫిక్ నిలిపివేశారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ స్టేషన్లలో మెట్రో రైలు ఆగదని మెట్రో అధికారులు ముందుగానే ప్రకటించారు. ఈ కార్యక్రమంతో తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ముగిసింది.