PM Modi Meeting Arrangements in Nizamabad : నిజామాబాద్‌లో రేపు ప్రధాని సభ... భారీగా ఏర్పాట్లు

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 6:13 PM IST

thumbnail

PM Modi Meeting Arrangements in Nizamabad : పాలమూరులో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) పసుపు బోర్డు ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మంగళవారం నిజామాబాద్‌లో జరగబోయే మోదీ సభను పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభకు రైతులను భారీగా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరడంతో రైతులు కూడా స్వచ్ఛందంగా సభకు తరలి వస్తారని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. 

నిజామాబాద్‌లో జరగబోయే సభ ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తారన్న నేపథ్యంలో జన సమీకరణపై ప్రధానంగా దృష్టి పెట్టారు. పార్టీ పరంగా బహిరంగ సభతో పాటు అధికారిక కార్యక్రమాల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. ఎస్‌పీజీ అధికారులు సభ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభ నిర్వహిస్తున్న మూడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. రాబోయే ఎన్నికలకు మోదీ సభ కీలకమవుతుందని జిల్లా నాయకులు భావిస్తున్నారు. ప్రధాని సభ ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.