ఓటు హక్కు వినియోగంపై విశ్రాంత ఉద్యోగుల మనోగతం - People Suggestions to Election Commission

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 6:57 PM IST

Officials Opinion On Telangana Assembly Elections 2023 : పాలకులను ప్రశ్నించాలంటే సరైన విధానంలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్నారు పలువురు విశ్రాంత ఉద్యోగులు. ఓటు వేసి నాయకుడ్ని తప్పుపట్టడం కంటే.. జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని ఓటు వేయడం మంచిదంటున్నారు. ఎన్నికల సంఘం కూడా ఓటింగ్ శాతాన్నిపెంచేందుకు ఓటు హక్కును ఆధార్​తో అనుసంధానం లాంటి సంస్కరణలు చేపట్టాలని కోరుతున్నారు. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వాలు, నాయకులపై విశ్వాసనం సన్నగిల్లడం వల్లే యువత చాలా వరకు ఓటింగ్ దూరంగా ఉంటున్నారని అన్నారు.

People Suggestions to Election Commission : అభ్యర్థుల ప్రలోభాలకు లొంగకుండా.. ప్రజా సమస్యలను తీర్చే నాయకులను ఎన్నుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఎన్నికల పోలింగ్​కు సంబంధించిన ఓటర్ స్లిప్​లలో కూడా పేర్లు సరిగ్గా లేదని విమర్శించారు. ఒకే పేరు రెండు పోలింగ్​ కేంద్రాల్లో ఉందని.. అలాంటి సమస్యలు రాకుండా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజా సమస్యల తెలిసి, వాటిని పరిష్కరించే నాయకులనే ఎన్నుకోవాలని కోరుతున్న వనస్థలిపురం విశ్రాంత ఉద్యోగులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.