తమ నేత ఓడిపోవడంతో కార్యకర్తల కంటతడి - భావోద్వేగానికి గురైన పైళ్ల శేఖర్‌రెడ్డి - Pailla Shekhar Reddy shed tears in Bhuvanagiri
🎬 Watch Now: Feature Video
Published : Dec 4, 2023, 2:58 PM IST
Pailla Shekar Reddy Cried in Bhuvanagiri : భువనగిరి నియోజకవర్గంలో ఓటమి పాలైన బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసేందుకు వచ్చిన గులాబీ కార్యకర్తలు ఒక్కసారిగా బోరున విలపించారు. దీంతో పైళ్ల శేఖర్‌రెడ్డి కూడా కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం వారికి ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇక్కడి ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇంటింటికీ తీసుకెళ్లానని పేర్కొన్నారు.
BRS Leader Pailla Shekar Reddy Tearful : ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకున్నారని, వారి తీర్పును గౌరవిస్తానని పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు పని చేశానని సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆర్ఆర్‌ఆర్ విషయంలో తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తనపై అకారణంగా ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేశాయని ఆరోపించారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని వివరించారు. దీనిపై తాను ఏ గుడిలోనైనా ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే నూతనంగా ఎంపికైన కుంభం అనిల్‌కుమార్ రెడ్డికి పైళ్ల శేఖర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.