Officers Responds ETV Story : ఈటీవీ కథనంతో నిధుల మంజూరు .. 'వరదొస్తే వణుకే' ప్రచురితమైన కథనానికి అధికారుల స్పందన - damaged roads in kamareddy
🎬 Watch Now: Feature Video
Officers Responds ETV Story : కామారెడ్డి జిల్లాలోని డోంగ్లి మండలం లింబూర్ వాడి గ్రామాంలో వాగుపై వంతెన నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. వాగుపై వంతెన లేక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారని జులై 31న 'ఈటీవీ తెలంగాణ భారత్లో 'వరదొస్తే వణుకే' ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు, వాగుపై వంతెన నిర్మాణానికి సీడీఎఫ్ రూ.3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇలా ఈటీవీ కధనానికి స్పందించి అధికారులు రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యాయని ప్రతి ఏడాది వర్షాకాలం వస్తే చాలు రోడ్డు బురద మయంగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉండేదని ప్రజలు నానా అవస్థలు పడుతున్నా ఎవ్వరు పట్టించుకోలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈటీవీ కథనంతో నిధులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.