Dharmapuri Arvind fires on BRS : "కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చి.. బ్లాంక్ బీ-ఫారమ్స్ తీసుకుంటున్న కేసీఆర్"​ - BRS

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 13, 2023, 5:31 PM IST

Dharmapuri Arvind fires on BRS : ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చి బ్లాంక్ బీ - ఫారమ్​లను తీసుకుంటారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రేవంత్​రెడ్డికి కేసీఆర్ డబ్బులు పంపుతున్నారన్నారని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ అవసరం లేదని కేసీఆర్ చెప్పమంటేనే రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. మూడు గంటలు చాలని ఏ రైతు రేవంత్​ రెడ్డికి చెప్పారని ప్రశ్నించారు. తెలంగాణలోని మెడికల్ కాలేజీలకు అన్నింటికీ కేంద్రమే నిధులు ఇస్తుందని చెప్పారు. 

కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని కక్కించెేందుకు ఒక మంత్రిత్వశాఖ కావాలని అర్వింద్ ఎద్దేవా చేశారు. తప్పుడు లెక్కలు ఇస్తున్నందుకే మంత్రి ప్రశాంత్​రెడ్డి కేసీఆర్​కు నచ్చారని మండిపడ్డారు. బాల్కొండ నియోజకవర్గంలో వందల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. బట్టాపూర్​లో శ్రీకాంత్, వంశీరెడ్డి అక్రమంగా క్వారీ క్రషర్లు నడుపుతున్నారని.. కనీసం పర్యావరణ అనుమతులు కూడా లేవన్నారు. క్వారీ 51లక్షలు కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్​శాఖ మంత్రి ఏమీ చేస్తున్నారని ప్రశ్నించారు. సామాన్యుడు రెండు వేల విద్యుత్ చార్జీ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తారని చెప్పిన విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డిపై ఎందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.