National Conference on Prisons: దేశంలోని జైళ్ల ఆధునికీకరణకు రూ.950కోట్ల కేటాయింపు.. పేద ఖైదీలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం చేయూత నిధి.. - 8th national conference on jails
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2023, 10:27 AM IST
National Conference on Prisons: దేశంలో జైళ్ల ఆధునికీకరణకు 9వందల యాభై కోట్ల రూపాయలను కేంద్రం వివిధ రాష్ట్రాలకు ఖర్చు చేస్తున్నట్లు.. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. వాటితో పాటు ఆరు చోట్ల జైళ్లను హైసెక్యూరిటీగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్.. ఏపీ జైళ్లశాఖ సంయుక్తంగా 8వ జాతీయ జైళ్ల సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రారంభించారు. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నామని.. వారి మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పారు. 2047నాటికి జైళ్లను ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చనే అంశంపై చర్చించడమే సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. పేద ఖైదీలు శిక్ష అనుభవించినప్పటికీ జరిమానాలు చెల్లించపోవడంతో.. జైళ్లలో మగ్గుతున్నారని అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని.. జైళ్ల చేయూత నిధి ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు. 99మంది వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.