MLC Kavitha Reacts on Women Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత.. - hyderabad latest news
🎬 Watch Now: Feature Video
Published : Sep 19, 2023, 8:01 PM IST
MLC Kavitha Reacts on Women Reservation Bill : పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టడంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ ప్రతిపాదించిన ప్రతి పార్టీ మద్దతు ఇస్తాయని తాము భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. బిల్లులో ఓబీసీ రిజర్వేషన్ అంశం చేర్చకపోయినప్పటికీ.. జనగణన పూర్తయ్యే వరకు దానిని చేర్చే అవకాశం ఉంటుందని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లు కేంద్రం తాత్సారం చేసినా.. ఇప్పటికైనా మహిళా బిల్లును కేంద్రం తీసుకురావటం సంతోషకరంగా ఉందని కవిత చెప్పారు. కేంద్రం పారదర్శకంగా ఉండాలని బిల్లు విధి విధానాలను దాయాల్సిన అవసరం లేదన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2014లోనే మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చినట్లు కవిత గుర్తు చేశారు. బిల్లు ఆమోదంతో భారతదేశంలో మహిళలు విశ్వం ముందు తలెత్తుకొని నిలబడేలా ఉంటుందని ఆకాశంలో సగం, భూమిలో సగం అధికారంలో సగమని మహిళా లోకం నినదించినట్లు అవుతుందని కవిత చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ సీఎం అయ్యాాక చాలా మంది మహిళలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మార్కెట్ చైర్మైన్లుగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు వస్తే సామాన్య మహిళలు అసెంబ్లీలలో, పార్లమెంటులో వెళ్లడానికి అవకాశం ఉంటుందని అన్నారు.