MLC Jeevanreddy Fires On Minister Koppula Eshwar : 'కాంగ్రెస్ దళిత డిక్లరేషన్‌పై మంత్రి కొప్పుల వ్యాఖ్యలు హాస్యాస్పదం' - బీఆర్ఎస్పై జీవన్‌రెడ్డి విమర్శలు 2023
🎬 Watch Now: Feature Video
Published : Sep 2, 2023, 7:29 PM IST
MLC Jeevanreddy Fires On Minister Koppula Eshwar : దళిత డిక్లరేషన్‌పై మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. దళిత సంక్షేమం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనేనని, దళితులకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. గాంధీభవన్‌లో అయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు దళితులకు ఎన్ని ఇళ్లు కట్టించిందని ప్రశ్నించారు. అర్హులైన లబ్దిదారులకు దళితబంధు అందించలేని అసమర్థత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్లల్లో తాము ఓట్లు అడుగుతామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్న ఊళ్లలో కేసీఆర్ ఓట్లు అడగాలన్నారు.
MLC Jeevan reddy coments On BRS : గత మూడేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎంత మందికి దళిత, బీసీ, మైనార్టీ బంధు ఇచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం కాదని, ఎస్సీ సంక్షేమంలో జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్‌ను ప్రశ్నించాలని జీవన్‌రెడ్డి అన్నారు.