MLA Rajaiah inaugurated CM Cup games : కబడ్డీ కూతతో.. మోత మోగించిన ఎమ్మెల్యే రాజయ్య - సీఎం కప్​ 2023 గేమ్స్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 15, 2023, 5:51 PM IST

MLA Rajaiah inaugurated CM Cup 2023 games in Hanmakonda :  హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని.. ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ నందు సీఎం కప్-2023 మండల స్థాయి క్రీడలను స్టేషన్ ఘన్​పూర్​ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ క్రీడా సంబురాలలో భాగంగా సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  

కబడ్డీ ఆడుతుండగా డీసీపీ అబ్దుల్​ని అవుట్ చేయడానికి ప్రయత్నించే క్రమంలో.. కిందపడిన ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అనంతరం తేరుకొని లేచి మళ్లీ అవుట్​చేశారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడలేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సీఎం కప్ పేరిట వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మండల, జిల్లా , రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భవించి ఈ జూన్​ 2నాటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోందని.. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్​ పేరిట క్రీడలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.