MLA Raja Singh: 'ఎమ్మెల్యేలను సచివాలయంలోకి రానివ్వరా...?' - secretariat current meetings
🎬 Watch Now: Feature Video
MLA Raja Singh on Secretariat : రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మించిన సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే కొత్త సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. ఈ క్రమంలో కొత్త సచివాలయం తెలంగాణ చరిత్రలోనే అద్భుతమని ఎమ్మెల్యేలు, మంత్రులు కొనియాడుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాత్రం విరుచుకుపడుతున్నారు. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సచివాలయంలోకి ఎమ్మెల్యేను వెళ్లనివ్వట్లేదని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ మూడు సబెక్టులపై ఈ రోజు సచివాలయంలో సమావేశం పెట్టారని దానికి సంబంధించి అందరు రావాలని మెసేజ్ చేశారని తెలిపారు. తాను కూడా సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. తమను ఆహ్వానించి అలా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో కట్టుకున్న సచివాలయంలో ప్రజాప్రతినిధులను రాకుండా అడ్డుకోవడమేంటని మండిపడ్డారు. ఓ ఎమ్మెల్యే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు.