ప్రోటోకాల్ రగడ - క్రిస్మస్ గిఫ్ట్‌ల పంపిణీపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం - ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
Published : Dec 23, 2023, 4:05 PM IST
MLA Palla Rajeshwar Reddy Fires on Christmas Gifts Distribution : క్రిస్మస్ గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్రమం వివాదానికి దారి తీసింది. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ వేడుకల మందిరంలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ గిఫ్టుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, మరో చోట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు అధికారులు ముందు ప్రకటించారు. అయితే మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమానికి రాకపోవడంతో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేతుల మీదగా గిఫ్ట్‌లు పంచారు.
Christmas celebrations 2023 : ఎమ్మెల్యే ఉండగా, డీసీసీ అధ్యక్షుడితో ఎలా పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆగ్రహించారు. ఈ క్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ శివ లింగయ్యతో వాగ్వాదానికి దిగారు. క్రిస్మస్ గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్రమానికి ముందు ఆహ్వానం రాలేదని, అధికారులంతా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి నిలదీశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడిని ఎలా స్టేజ్ మీదకి పిలుస్తారని, ఫ్లెక్సీలో కనీసం తన ఫొటో కూడా వేయలేదని ఆందోళన చేశారు. తన ఫొటో లేకుండా డీసీసీ అధ్యక్షుడి ఫొటో ఎలా కటౌట్లో పెడతారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.