Karimnagar Missing Girl Death : అయ్యో పాప.. డ్రైనేజీలో కృతిక మృతదేహం లభ్యం - Karimnagar missing girl dead
🎬 Watch Now: Feature Video
Karimnagar missing girl krithika dead news : అల్లారుముద్దుగా పెంచుకున్న వలసకూలీల మూడేళ్ల చిన్నారి కృతిక.. అదృశ్య ఘటన విషాదంతంగా ముగిసింది. జులై 27న ఇంటి నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కరీంనగర్ రాంనగర్లో నివాసం ఉంటున్న.. మధ్యప్రదేశ్ వలసకూలీల చిన్నారి కృతిక జులై 27న అదృశ్యం అయింది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. చిన్నారి ఎటువైపు వెళ్లింది, ఏమైపోయిందన్న విషయం అంతు చిక్కకుండా పోయింది. జోరుగా కురుస్తున్న వర్షాలతో వరదలు ముంచెత్తుతున్న సమయంలో.. ఇంటి నుంచి బయటకు వచ్చిన చిన్నారి డ్రైనేజీలో పడి గల్లంతయిందా లేక ఎవరైనా ఎత్తుకెళ్లారా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారం రోజులుగా చిన్నారి కోసం వెతుకుతున్న క్రమంలో.. గురువారం తెల్లవారుజామున కరీంనగర్‌లోని లక్ష్మీనగర్ డ్రైనేజీలో చిన్నారి శవం లభ్యమైంది. అయితే చిన్నారి మృతదేహం తల లేకుండా లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వరదల ధాటికి చిన్నారి తల కొట్టుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. అనంతరం సివిల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.