thumbnail

వీరుల్లారా వీరవనితల్లారా అంటూ మంత్రి పువ్వాడ అజయ్‌ పాట వీడియో వైరల్

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 7:15 PM IST

Minister Puvvada Ajay Kumar Sing Song Video Viral : ఎప్పుడూ పాలన, రాజకీయం అంటూ బిజీబిజీగా ఉండే మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌.. వీరుల్లారా.. వీర వనితల్లారా అంటూ పాట పాడి అందరినీ ఊర్రూత లాగించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో తన గానంతో సభకు వచ్చిన వారిని ఆనందపరిచారు. పాటతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటూ.. జై తెలంగాణ.. తెలంగాణ అమరవీరులకు జోహార్‌లు అంటూ సభలో  ఒక్కసారిగా ఊపు తెప్పించారు. 

మంత్రి పువ్వాడ తన మెడలో ఉన్న పార్టీ కండువాను పైకెత్తి.. ఊపు ఊపారు. సీఎం కేసీఆర్‌ సభకు వచ్చే వరకు అక్కడ ఉన్న ప్రజానికాన్ని ఆహ్లాదపరచడానికి.. తెలంగాణ పోరాట పాటలు, కేసీఆర్‌ పేరుతో ఉన్న పాటలను గాయకులు పాడుతున్నారు. వారితో పాటు ఆ గానానికి తగ్గట్లుగా కొందరు యువత స్టేజ్‌ పక్కన స్టెప్పులు వేస్తున్నారు. ఇంతలో మైక్‌ అందుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌.. తన పక్కన ఉన్న గాయకుడితో కలిసి వీరుల్లాలా.. వీర వనితల్లారా అంటూ పాట పాడారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.