ఇండియా - బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ - హైదరాబాద్ చేరుకున్న భారత ఆటగాళ్లు - INDIAN PLAYERS REACHED HYDERABAD
🎬 Watch Now: Feature Video
Published : Oct 10, 2024, 10:03 PM IST
India Team Reached Hyderabad : భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ వేదికగా శనివారం మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న టీమ్ఇండియా ప్లేయర్లు అక్కడి నుంచి పార్క్ హయత్ హోటల్కి చేరుకున్నారు. అక్కడే బస చేయనున్నారు. ఇదిలా ఉంటే భారత ఆటగాళ్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు.
కాగా ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమ్ఇండియా రెండు టీ20 మ్యాచ్‌లు గెలిచింది. సిరీస్ను భారత్ 2-0తో సొంతం చేసుకోగా ఈనెల 12న ఉప్పల్లో నామ మాత్రపు మ్యాచ్ జరుగనుంది. చాలా రోజుల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆన్లైన్లో ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు జింఖానా స్టేడియంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రిడంప్షన్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డు చూపించి, ఆన్‌లైన్ టికెట్ బుక్ చేసుకున్న ప్రింట్ చూపించి టికెట్లు పొందాలని కోరారు. మ్యాచ్ టిక్కెట్లను ఈసారి ఆఫ్లైన్ కౌంటర్లలో విక్రయించడం లేదని స్పష్టం చేశారు.