'కేసీఆర్ నవంబర్ 30న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం' - బీఆర్ఎశ్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళనం
🎬 Watch Now: Feature Video
Published : Nov 6, 2023, 8:37 PM IST
Minister KTR Speech At BRS Yuva Atmiya Sammelanam : తెలంగాణ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. నవంబర్ 30న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని.. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సినిమాకు కన్నడ ప్రొడ్యూసర్, దిల్లీ డైరెక్టర్, గుజరాత్ యాక్టర్ ఉన్నారని.. ఆ సినిమా డిజాస్టర్ కావడం ఖాయమని ఆరోపించారు.
BRS Party Yuva Atmiya Sammelanam : సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ యువ ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ హయాంలో 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు కొత్త పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిదిన్నరేళ్ల కిందట సాధించుకున్న తెలంగాణలో.. ఎన్నడూ సీఎం కేసీఆర్ కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదన్నారు. అభివృద్ధే తన కులం, సంక్షేమమే తన మతమని ప్రతీ వ్యవస్థని భాగుచేసిందని కేసీఆరే అని తెలిపారు. దిల్లీ దొరలకు 4 కోట్ల మంది ప్రజలకు జరిగే ఈ పంచాయితీలో తప్పకుండా తెలంగాణ ప్రజలు గెలుస్తారాని ఆశాభావం వ్యక్తం చేశారు.