గులాబీల జెండాలే రామక్క - మన రామన్న స్టెప్పేసిండే రామక్క - ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video
Published : Nov 6, 2023, 7:16 PM IST
Minister KTR Dance Video : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలు చేస్తూ.. తమకే ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఓవైపు పార్టీ అధినేత సభలతో పాటు అభ్యర్థులూ ఎక్కడికక్కడ గ్రామగ్రామాన తిరుగుతూ రాష్ట్ర ప్రగతిని వివరిస్తున్నారు. క్యాచీ స్లోగన్స్, అద్దిరిపోయే డ్యాన్స్‌లతో ప్రచారంలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. సాధారణ ఓటర్లతో పాటు యువ ఓటర్లను ఆకట్టుకునేలా రొటీన్‌కు, ప్రతిపక్ష పార్టీలకు భిన్నంగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఈ వరుసలో అందరికంటే ముందుండగా.. ఇతర మంత్రులూ ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మంత్రి కేటీఆర్ చేరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్ యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి వేదికపై కాలు కదిపారు. ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్‌లో ఉన్న రామక్క పాటకు రామన్న స్టెప్పేసి అక్కడికి వచ్చిన వారిలో ఉత్సాహం నింపారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'రామక్క పాట - రామన్న ఆట' రెండూ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.