Minister koppula Distributed Laptops to Students : విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ - మంత్రి కొప్పుల ఈశ్వర్ తాజా సమాచారం
🎬 Watch Now: Feature Video
Published : Aug 31, 2023, 10:26 PM IST
Minister koppula Distributed Laptops to Students : రాజకీయ నిర్ణయంతోనే వ్యవస్థలో మంచి మార్పు వస్తుందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సమాజం పట్ల కూడా దృష్టి సారించాలని సూచించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. గతంలో ఒక్క కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్యను 38కి పెంచామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలను ఇతర రాష్ట్రాల ప్రతినిధుల బృందం వచ్చి పరిశీలించి వెళ్లిందని పేర్కొన్నారు. వారి రాష్ట్రాల్లో కూడా కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ విధానం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికే గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో గురుకుల విద్యా విధానాన్ని అభివృద్ది చేశారని కొప్పుల పేర్కొన్నారు. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 2022-23 సంవత్సరంలో ఐఐటీలో 62, నిట్, ట్రిపుల్ ఐటీల్లో 113 మంది విద్యార్థులు, ఎంబీబీఎస్‌లో 205 మంది, ఇంజినీరింగ్ కాలేజీల్లో 8 వందల మంది సీట్లు సాధించారని వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ఉత్తమ పౌరులుగా ఎదిగి తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి అభినందించారు.