ప్రభుత్వం ఇచ్చిన హమీల అమలు దిశగా ప్రతి ఒక్క అధికారి పని చేయాలి : మంత్రి దామోదర రాజనర్సింహ - మంత్రి దామోదర రాజనరసింహ కలెక్టర్లతో భేటీ
🎬 Watch Now: Feature Video
Published : Dec 25, 2023, 5:57 PM IST
Minister Damodara Rajanarasimha Meeting with Collectors : రాబోయే వంద రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలు దిశగా ప్రతి ఒక్క అధికారి పని చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. గత ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం అధికారులను ఇబ్బంది పెట్టదనీ, స్వతంత్రంగా పని చేసే స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని అధికారులకు భరోసా కల్పించారు. గత ప్రభుత్వంలో ఎలా పని చేశారో తమకు అనవసరమని, ఇప్పుడు మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రతి ఒక్కరూ జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి అధికారి వరకు పని చేయాలన్నారు.
Health Minister Meet District Officers In Sangareddy : ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ముందుకు సాగి ప్రజల సమస్యలు తీర్చే విధంగా కృషి చేద్దామని ఉద్ఘాటించారు. ప్రజలు ఎట్టి పరిస్థితిలో అసహనానికి గురికాకుండా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్పు జరిగిందని, దానికి తగినట్లే ప్రజల ఆశలు, ప్రభుత్వ ఆశయాలు నెరవేర్చే విధంగా యంత్రాంగం పని చేయాలన్నారు. ప్రజా పాలన కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు.