Experts Advice to Farmers : రైతన్నలు.. ఈసారి విత్తనాలు వేసేముందు ఆ జాగ్రత్తలు తీసుకోండి - adilabad latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 19, 2023, 2:14 PM IST

Experts Advice to Farmers : రాష్ట్రంలో నెలకొన్న భిన్నమైన వాతావరణ స్థితిగతుల కారణంగా.. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎలినో ప్రభావంతో అక్కడక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా ఖరీఫ్‌ పనులతో పాటు పంటల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో నేలలోని క్రిమి, కీటకాల ప్రభావం పెరిగి.. పెట్టుబడి ఖర్చులు రెట్టింపు అవుతాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. పగటి పూట వడగాలులు, ఎండలతో ఖరీఫ్‌ పనులకు ఆటంకం ఏర్పడటంతో పాటు జూన్‌ మొదటి వారంలో వచ్చే నైరుతి రుతుపవానాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటికే అతలాకుతలమై ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యవసాయ రంగంపై తాజా వాతావరణ స్థితిగతులు మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఒక్క వర్షంతోనే విత్తనాలు వేయడానికి సిద్ధం కాకుండా వ్యవసాయ నిపుణుల సూచనలు, సలహాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని కొంత తగ్గించుకునే  అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.