mariamma tirunallu: ఆ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా పొట్టేళ్ల పోటీలు.. మీరూ చూడండి - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18371496-thumbnail-16x9-pottelu.jpg)
Mariamma Tirunalla fair in Suryapet: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో శుభవార్త దేవాలయంలో క్రిస్టియన్స్ మరియమ్మ తిరునాళ్ల జాతర అట్టహాసంగా జరుగుతోంది. గత రెండు రోజులుగా ఉత్సవాలు జరుగుతుండగా.. ఈ జాతరలో జరిగే కార్యక్రమాలను తిలకించడానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. మరియమ్మ జాతరలో ప్రత్యేకంగా ఈసారి పొట్టేళ్ల బల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈరోజు (శుక్రవారం) రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పొట్టేళ్ల మధ్య బల ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రదర్శనలో 26 పొట్టేలు పాల్గొన్నాయి.
మొదటి విడతలో 13 పొట్టేళ్లు ఓడిపోగా.. మిగిలిన 13 పొటేళ్లకు డ్రా పద్ధతిన పోటీలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ పోటీల్లో మొదటి బహుమతిగా రూ.30 వేలు, రెండో బహుమతిగా రూ.25000, మూడో బహుమతిగా రూ.20 వేలు షీల్డ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎక్కువ పొట్టేళ్లు ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చాయని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా పొట్టేళ్ల ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతాయని.. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు.