ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామంటూ ఖర్గే కేంద్రానికి లేఖ రాయాలి : మందకృష్ణ మాదిగ - SC Reservation in Telangana
🎬 Watch Now: Feature Video
Published : Jan 13, 2024, 8:03 PM IST
Manda Krishna Madiga on SC Reservation : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రానికి లేఖ రాయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. ఇవాళ హైదరాబాద్లో మాట్లాడిన ఆయన, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఈ నెల 17న తీర్పు వెలువడనున్న తరుణంలో కాంగ్రెస్ స్పష్టమైన అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
Manda Krishna Madiga on MLC : ఇప్పటికే దేశంలోని ప్రధాన పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినా, కాంగ్రెస్ మాత్రం స్పష్టత ఇవ్వలేదని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎన్నికల ముందు ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించిన హస్తం పార్టీ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఎస్సీలకే ఇవ్వాలన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో సామాజిక సమతుల్యం కొరవడిందన్న ఆయన, త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.