మద్యం మత్తులో ఓ వ్యక్తిని ఢీకొన్న ట్రాఫిక్​ కానిస్టేబుల్​ - పాదచారుడు మృతి - ఎస్ఆర్‌నగర్ కానిస్టేబుల్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 8:34 PM IST

Updated : Jan 1, 2024, 9:36 PM IST

Man Died after Constable Vehicle Hit at Hyderabad : బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఓ ట్రాఫిక్​ కానిస్టేబుల్​ మద్యం మత్తులో వేగంగా ద్విచక్రవాహనం నడుపుతూ వెనక నుంచి ఢీ కొట్టాడు. దీంతో దుర్గయ్య(58) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. బాలానగర్​లో నివసించే కందుకూరి దుర్గయ్య అనే వ్యక్తి అమీర్​పేట్​లోని ఓ షాపింగ్​మాల్​లో పని చేస్తూ ఉండేవాడు.  

Constable Rush Drive at Balanagar : ఎప్పటిలాగానే తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో బాలానగర్​లోని మెజిస్టిక్ గార్డెన్ వద్ద, ఎస్ఆర్‌నగర్ పీఎస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లికార్జున్​ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ దుర్గయ్యను ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే కానిస్టేబుల్​ తన బైక్​ను వదిలి పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Jan 1, 2024, 9:36 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.