Lyricist Sri Chandana Interview : 'నా పేరు శ్రీ చందన.. నా వయస్సు 19.. నేను రాసిన పాటలు వెయ్యికిపైనే..'
🎬 Watch Now: Feature Video
Lyricist Sri Chandana Interview : నిండా ఇరవై ఏళ్లు లేవు కానీ.. వెయ్యికి పైగా గీతాలు రాసిన అనుభవం ఆ అమ్మాయిది. అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలను అలవోకగా పాడే నైపుణ్యం ఆమె సొంతం. బాల్యంలోనే ఏకంగా తిరుమలేషుడి లడ్డూ పైన ప్రత్యేకంగా గీతం రాసి ఆలపించి ఔరా అనిపించింది. తానే హైదరాబాద్కి చెందిన శ్రీ చందన. తన పేరునే కలం పేరుగా మార్చుకుని గీతాలను రాస్తూ.. ఆలపిస్తూ... పలు అవార్డులను సొంతం చేసుకుంది. తనను ఈ కళ వైపు నడిపించడానికి ఆ దైవానికి ఓ కారణం ఉండే ఉంటుందని అంటోంది ఈ అమ్మాయి. రాబోయే తరాలకు తెలుగు గొప్పతనం చాటేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నాని చెబుతోంది శ్రీ చందన. దేవుళ్లపైనే కాకుండా సమాజంలోని అంశాల పట్ల కూడా గీతాలను రాస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. రచయితల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. సమాజంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆ వాగ్గేయకారిణితో ముఖాముఖి.