Laxman on PM Vishwakarma Scheme 2023 : 'చేతివృత్తుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే.. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం' - Details of Prime Minister Vishwakarma Scheme

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2023, 7:45 PM IST

Laxman on PM Vishwakarma Scheme 2023 : భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ.. కులవృత్తులు, చేతి వృత్తుల మీద ఆధార పడిందని.. గత పాలకులు ఈ వర్గాలను విస్మరించారని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. పాలకుల ఆలోచనా విధానం పెట్టుబడిదారులకే పెద్దపీట వేయడం జరిగిందన్నారు. దీనివల్ల లక్షల కుటుంబాలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. కుల, చేతి వృత్తుల వర్గాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో.. ఆధునీకరించిన పరికరాలను కేంద్ర ప్రభుత్వం.. విశ్వకర్మ పథకం ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. 

PM Vishwakarma Yojana 2023 : మోదీ జన్మదినం రోజైన సెప్టెంబర్ 17న.. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి ప్రారంభించే ఈ పథకాన్ని అన్ని జిల్లాల్లో ప్రజలు వీక్షించేలా ఓబీసీ మోర్చా ఏర్పాట్లు చేస్తోందన్నారు. 140 జాతులకు సంబంధించి 18 వృత్తుల వారు లబ్ధి పొందబోతున్నారన్నారు. విశ్వకర్మ పథకంలో భాగంగా వసతితో కూడిన.. నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం స్వయం ఉపాధికి.. నామమాత్రపు వడ్డీతో బ్యాంకు రుణాలను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.