Korutla Bus Accident Live Video : కొద్దిలో మిస్సైందిగా.. బైక్ను తప్పించబోయి.. గుంతలోకి వెళ్లిన ఆర్టీసీ బస్సు - తెలంగాణ న్యూస్
🎬 Watch Now: Feature Video
Korutla Bus Accident Live Video : జగిత్యాల జిల్లా కోరుట్లలో ద్విచక్ర వాహనాన్ని తప్పించే యత్నంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పెద్ద గుంతలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు.. కోరుట్ల మండలం వెంకటాపూర్ వద్ద ద్విచక్ర వాహనదారుడు ఒక్కసారిగా అడ్డువచ్చాడు. అతడిని తప్పించబోయే యత్నంలో బస్సు రోడ్డు పక్కనే ఉన్న పెద్ద గుంతలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులకు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ద్విచక్ర వాహనం(Bike Accident)పై వెళ్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు.