Kishan Reddy Reacts to Chandrababu Naidu Arrest : 'ముందస్తు నోటీసులు, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు' - స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2023, 3:19 PM IST
|Updated : Sep 12, 2023, 3:43 PM IST
Kishan Reddy Reacts to Chandrababu Naidu Arrest : దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై జాతీయ నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. అసలు చంద్రబాబు అరెస్టు అక్రమమని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ.. చంద్రబాబు అరెస్టు గురించి తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
ముందస్తు నోటీసులు, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని తెలిసిందని అన్నారు. తనకు అంత వరకే విషయం తెలుసని తానింకా డాక్యుమెంట్లు చూడలేదని వివరించారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల సన్నాహకాలలో భాగంగా.. నేతలకు దిశానిర్దేశం చేస్తూ.. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడారు. సోమవారం బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ చంద్రబాబు అరెస్టు తీరును ఖండించారు. జాతీయ నేతలు మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షతోనే టీడీపీ అధినేతను అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇలా ప్రతిపక్ష నేతలను అవినీతి మరక చూపి అరెస్టు చేయడం.. రాష్ట్రాన్ని ప్రభుత్నానికి తగదని సీఎం జగన్పై విమర్శలు చేశారు.