Kishan Reddy Fires on KCR : 'ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు' - Kishan Reddy criticism BRS government

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 4:10 PM IST

Kishan Reddy Fires on KCR in Hyderabad : తెలంగాణలో 9 సంవత్సరాలుగా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీకి ముందుకు రాదని.. కానీ ఇచ్చిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలోనూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​ (TSPSC) పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి కోచింగ్​ తీసుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్​లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy Comments on TSPSC :  అయినా ఉద్యోగాలను భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) కుట్ర చేస్తున్నారని కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. నిరుద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. దీంతో నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలతో ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలోనే అక్టోబర్‌ 1న తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తారని తెలిపారు. బేగంపేటలో సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ సంస్థకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అనంతరం పాలమూరు నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని కిషన్​రెడ్డి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.