ఐదు రోజుల తర్వాత భక్తులకు దర్శనమిచ్చిన ఐనవోలు మల్లన్న - ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనం
🎬 Watch Now: Feature Video
Published : Dec 17, 2023, 7:39 PM IST
Inavolu Mallikarjuna Swamy Darshanam : హనుమకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి ఐదు రోజుల తర్వాత భక్తులకు దర్శనమిచ్చారు. సుధావలి వర్ణలేపనం దృష్ట్యా గత ఐదు రోజులుగా ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఇవాళ గర్భగుడి శుద్ధి, దృష్టి కుంభం అనంతరం ఆలయ అర్చకులు భక్తలను దర్శనానికి అనుమతించారని ఆలయ కార్యనిర్వహన అధికారి అద్దంకి నాగేశ్వర్‌రావు వెల్లడించారు.
Inavolu Mallikarjuna Swamy Darshanam After 5 Days : ప్రతి సంవత్సరం ఐనవోలలో వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు(Inavolu Brahmotsavam Start Today) నేటి నుంచి ప్రారంభం అయ్యాయని నాగేశ్వర్‌రావు తెలిపారు. వచ్చే ఏడాది ఉగాది వరకు సుమారు 3 నెలలు ఈ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు రవీందర్ శర్మ పేర్కొన్నారు. ఇవాళ స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారని అన్నారు. దేవాలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.
TAGGED:
ఐనవోలు మల్లికార్జున స్వామి