summer camp: పిల్లలూ.. మీరు కూడా సమ్మర్ ఇలాగే ఎంజాయ్ చేస్తున్నారా..? - madapur shilparamam summer camp
🎬 Watch Now: Feature Video
shilparamam summer camp in hyderabad: హైదరాబాద్ మాదాపుర్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపులో పిల్లలు పెద్దలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సమ్మర్ క్యాంపులో చిన్నా పెద్ద వయస్సుతో తేడా లేకుండా మట్టి కుండల తయారీ, మట్టి బొమ్మలు తయారీ, మదుభని పేయింటింగ్, నిర్మల్ పేయింటింగ్, సంస్కృత భాషా మాట్లాడడం భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటూ సమ్మర్ హాలిడేస్‌ను జాలీగా ఎంజాయ్ చేస్తూ కాస్త జ్ఞానాన్ని కూడా పెంచుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ క్యాంపు 15వ తేదీ వరకు కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారికి ఈ క్యాంపులో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. గతేడాది ఏడాది కంటే ఈ ఏడాది సమ్మర్ క్యాంపునకు మంచి స్పందన వస్తోందని.. పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని చెప్పార. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్ ఆడే వాళ్లమని.. కానీ ఈ సమ్మర్లో మాత్రం ఈ క్యాంపునకు వచ్చి చాలా విషయాలు నేర్చుకుంటున్నామని పిల్లలు అంటున్నారు. మట్టి కుండలు, మట్టి బొమ్మలు తయారు చేయడం నేర్చుకున్నామని.. తాము తయారు చేసిన బొమ్మలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.