హైదరాబాద్ - విజయవాడ రూట్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ - 5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు - ఎన్‌హెచ్ 65పై ట్రాఫిక్ జామ్
🎬 Watch Now: Feature Video
Published : Jan 13, 2024, 5:28 PM IST
Heavy Traffic Jam on National Highway 65 : సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రహదారులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. గత రెండు, మూడు రోజుల నుంచి జాతీయ రహదారులన్నీ ఫుల్‌గా దర్శనమిస్తున్నాయి. ఎన్‌హెచ్ 65 రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో ధర్మాజీ గూడెం స్టేజ్ వద్ద గందరగోళం ఏర్పడింది.
విజయవాడ వెళ్లే వాహనాలను రెండు ప్రధాన రహదారులపైకి పంపించడంతో, 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్ నిలిచిపోయింది. రేపటి నుంచే పండుగ మొదలు అవుతుండడంతో గత రెండు రోజుల కంటే రెండింతల వాహనాలు నేడు నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే పనిలో నిమగ్నమయ్యారు.