Heavy Rains In Mahabubabad : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వాన.. నిలిచిపోయిన రాకపోకలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 22, 2023, 2:04 PM IST
Heavy Rains In Mahabubabad : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
Roads Damage in Mahabubabad : కేసముద్రం మండలం అర్పణపల్లి బ్రిడ్జి పైనుంచి వట్టివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కేసముద్రం, గూడూరు మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అక్కడి గ్రామ సర్పంచ్.. సేవకులను వరద ప్రవాహం వద్ద కాపలాగా ఉంచి రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మరోవైపు ఏకధాటిగా రాత్రి కురిసిన కుండపోత వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం వద్ద ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులు నిన్నటి నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. గనిలో నిలిచిన వర్షపు నీటిని భారీ పంపుల ద్వారా బయటకు పంపేందుకు సింగరేణి అధికారులు చర్యలు చేపట్టారు. వర్షం నీరు నిలవడం వల్ల భారీ నష్టం జరిగినట్లు తెలిపారు.