Godavari Water Level Today : భద్రాచలం వద్ద పెరుగుతోన్న గోదావరి నీటిమట్టం.. స్థానికుల్లో టెన్షన్​.. టెన్షన్​

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2023, 7:17 PM IST

thumbnail

Godavari Water Level Today at Bhadrachalam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం (Godavari Water Level ) స్వల్పంగా పెరుగుతోంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గోదావరి నీటిమట్టం 30 అడుగులు దాటి ప్రవహిస్తోంది. వరద నీరు స్నాన ఘట్టాల వరకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహం వల్ల.. కొద్దిమేర నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. ఇంకా కొంతమేర పెరిగి.. తగ్గే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. మరోవైపు గోదావరిలో నీటిమట్టం పెరుగుతుండటంతో భద్రాచలం ప్రజల్లో భయాందోళన నెలకొంది.

గత సంవత్సరం వచ్చిన వరదలకు గోదావరి కరకట్ట చాలా వరకు పాడైంది. కరకట్టకు అక్కడక్కడ రాళ్లు కూడా లేచిపోయాయి. గతేడాది 72 అడుగులు రావడంతో కరకట్ట చివరి భాగం వరకు గోదావరి నీటిమట్టం చేరి ప్రవహించింది. చాలా వరకు కరకట్ట బలం తగ్గింది. దీని పునరుద్ధరణ పనులు చేయకపోవడం వల్ల స్థానిక ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ వరదలు వస్తే.. ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని ఆవేదన చెందుతున్నారు. భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.