శంకర్పల్లిలో 44 కేజీల గంజాయి స్వాధీనం - నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు - mokhila police station ganja news
🎬 Watch Now: Feature Video
Published : Jan 18, 2024, 12:22 PM IST
Ganja seized In Shankarpally : రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. ఈ క్రమంలోనే ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న ఓ వాహనంలో గంజాయి పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో 44 కేజీల గంజాయి స్వాధీనం పట్టుబడింది.
44 kg Ganja seized Police : శంకర్ పల్లి మండలం మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద బుధవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా బ్రౌన్ కలర్ పార్సెల్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. అనుమానం వచ్చి స్వాధీనం చేసుకొని తనిఖీ చేయగా 22 బ్యాగుల్లో 44 కిలోల గంజాయి గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన గజానన్ సుభాష్, గోవిందా ధారాసింగ్ జాదవ్, శిల్పలు ఒడిస్సా సరిహద్దుల్లో గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.