Flytech Aviation Academy : ఇంటర్‌తోనే ఏవియేషన్ రంగంలో ఉద్యోగం
🎬 Watch Now: Feature Video
Flytech Aviation Academy : ప్రపంచవ్యాప్తంగా పైలట్ల కొరత వేధిస్తోంది. దేశంలో ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు.. విదేశాలకు ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ దేశంలో కావాల్సినంత మంది పైలట్లు లేరు. దీంతో ఎవియేషన్ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. పైలట్ శిక్షణ తీసుకునేందుకు గతం కంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచి ముందుకు వస్తున్నారని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ సీఈవో మమత అన్నారు. ఇంటర్మీడియట్తోనే పైలట్ రంగంలో రాణించవచ్చని తెలిపారు. అతి తక్కువ సమయంలో స్థిరపడే.. ఎక్కువగా అవకాశం ఉన్న రంగాల్లో పైలట్ రంగం ఒకటని చెప్పారు.
ఏవియేషన్ రంగంలో చేరాలనుకొనే వారికి చాలా కోర్సులు ఉన్నాయని మమత అన్నారు. ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయంలో 10,000 మంది ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. రానున్న 20 ఏళ్లలో ఏవియేషన్ రంగంలో అపారమైన అవకాశాలు ఉంటాయని చెప్పారు. పైలట్ శిక్షణలో అమ్మాయిలు ఎక్కువ సంఖ్యలో ధైర్యంగా ముందుకు వస్తున్నారని చెబుతోన్న ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమి సీఈవో మమతతో ముఖాముఖి.