Fighting on Road With Knifes in Hyderabad : ఆస్తి వివాదం.. నడిరోడ్డుపై కర్రలు, కత్తులతో దాడి - చంద్రాయనగుట్ట క్రైం న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-07-2023/640-480-19006559-303-19006559-1689420946219.jpg)
Fighting on Road With Knifes : హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై కట్టెలతో కొట్టుకుంటూ కత్తి పోట్ల వరకూ వెళ్లిన ఘటన కలకలం రేపింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి బార్కస్ ప్రాంతానికి చెందిన ఖలీద్, అబ్దుల్ రహమాన్, అమేర్ అనే ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై ఒకరిపై మరొకరు కట్టెలతో, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. సమాచారం అందుకున్న చంద్రాయణగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే వంశానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆస్తి వివాదం కారణంగా దాడి చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు మలక్పేట్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న దక్షిణ తూర్పు మండలం డీసీపీ రూపేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒకే వంశస్థులు కావడం వల్ల ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. చాంద్రాయణగుట్ట పోలీసులు సుమోటో కేసుగా స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.