పార్టీ కండువాలతో పోలింగ్ కేంద్రాలకు పలువురు ఎమ్మెల్యేలు - మంత్రి ఇంద్రకరణ్రెడ్డిపై కేసు నమోదు - police files case on minister indrakaran reddy
🎬 Watch Now: Feature Video
Published : Nov 30, 2023, 4:28 PM IST
Few MLA's Voting with Party symbol Scraf In Polling Station : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ పలువురు ఎమ్మెల్యేలు పార్టీ కండువాలతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం వివాదానికి దారితీసింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ వి.వి మందిర్ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఆయన అనుచరులు పార్టీ కండువాలతో ప్రవేశించారు. కండువాలు తొలగించాలని సీఐ చెప్పడంతో.. ఎమ్మెల్యే సైదిరెడ్డి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ మాటలను ఎమ్మెల్యే బేఖాతరు చేయడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
police filed Case On minister indrakaran reddy : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సైతం ఇలాగే చేశారు. నెన్నెల మండలం జెండా వెంకటాపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. పార్టీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఎమ్మెల్యే గులాబీ కండువాతో వచ్చి ఓటు వేసినా ఎన్నికల సిబ్బంది ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం విమర్శలకు దారితీసింది. ఇదే విషయంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డిపై కేసు నమోదైంది. ఎల్లపెల్లిలో గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆయన ఓటు వేశారు. దీంతో ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిర్మల్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మంత్రిపై కేసు నమోదైంది.