పల్లె సంతని ఆసరాగా తీసుకొని నకిలీ నోట్లతో... - తెలంగాణ నకిలి నోట్ల వ్యవహారం
🎬 Watch Now: Feature Video
Fake notes issue at Bhainsa: పల్లెల్లో జరిగే వారసంతలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాగా వారికి అమ్మినప్పుడు వచ్చే పెద్ద నోట్లు నకిలీవా కాదా అనే చూసుకోని అమాయకులుంటారు. ఇదే ఆసరాగా తీసుకున్నాడో వ్యక్తి. రెండు సార్లు 500 నోట్లను తన దగ్గర ఉన్న వ్యాపారుని దగ్గర చిన్న మొత్తంలో కూరగాయలు కొని నకిలీ నోటు ఇచ్చి మార్చాడు. బాధితుడు నోటు గుర్తు పట్టే సమయానికి పరారయ్యాడు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతి సోమవారం మాదిరిగానే సంత జరుగుతోంది. ఒక కూరగాయల దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రూ.20 కాయగూరలు కొని తన దగ్గర ఉన్న రూ.500 నకిలీ నోటు మార్చి చిల్లర తీసుకెళ్లాడు. అదే వ్యక్తి కాసేపటి తర్వాత మరో రూ. 00 తీసుకొని తిరిగి అదే కూరగాయల వ్యక్తి వద్దకు వచ్చాడు. అనుమానం వచ్చిన దుకాణాదారుడు నోట్లను గమనించగా అవి నకిలీదని తెలింది. ఇంతలో అతన్ని పట్టుకోడానికి ప్రత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు ఆ యజమాని. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.