Pratidwani అన్నిపార్టీల రూటు అటు వైపేనా - అన్నిపార్టీల రూటు అటు వైపేనా
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17076769-1091-17076769-1669821518445.jpg)
Pratidwani చూస్తుండగానే రాష్ట్ర రాజకీయాలు పూర్తిస్థాయిలో హీటెక్కుతున్నాయి. కొన్ని నెలలుగా ఉన్న హడావుడిని మునుగోడు ఉపఎన్నికే పతాకస్థాయికి చేర్చింది. అనంతర పరిణామాలు, ముందస్తుపై లేదు.. ఉందీ.. అంటున్న ఖండనలు, అంచనాలు, పాదయాత్రలు, వివాదాలు, దాడులు, మాటల తూటాలు క్షేత్రస్థాయి కదనరంగాన్ని కళ్లకు కడుతున్నాయి. తెరాస, కాంగ్రెస్, భాజపాలే కాదు.. బీఎస్‌పీ, వైఎస్సార్‌టీపీల కార్యాచరణలు పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. అసలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏమిటి? అందరిలో చర్చ జరుగుతున్న ముందస్తు ముచ్చట ఉన్నట్లా... లేనట్లా...? మల్టీకార్నర్ ఫైటే ఖాయం అయ్యే పరిస్థితులు రాజకీయ సమీకరణాలు ఎలా ఉండొచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST