Drunk Lady Hulchul Hyderabad Viral Video : ఫ్రెండ్స్‌తో కలిసి మందేసింది.. పోలీసులకు చుక్కలు చూపించింది.. చివరకు! - హైదరాబాద్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 10, 2023, 12:13 PM IST
Drunk Lady Hulchul Hyderabad Viral Video : సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో మద్యం మత్తులో ఓ యువతి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దాదాపు రెండు గంటల పాటు ప్రధాన రహదారిపై నానా హంగామా సృష్టించింది. నా ఇష్టం.. నా పైసల్తో నేను తాగినా.. నీకేంది అంటూ పోలీసులపై విరుచుకుపడింది. అసభ్య పదజాలంతో వారిని దూషించింది. చివరకు పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Drunk Lady Argues With Police Hyderabad : ఓ ఈవెంట్‌కు వెళ్తున్న యువతి మిత్రులతో కలిసి మద్యం సేవించి కారును వేగంగా డ్రైవ్ చేసింది. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద వేగంగా కారు నడపడం చూసి అనుమానం కలిగిన ట్రాఫిక్ పోలీసులు.. ఆ వాహనాన్ని రెండు కిలో మీటర్లు వెంబడించారు. చివరకు ఆమెను ఆపేందుకు యత్నించిన కానిస్టేబుల్‌ను యువతి కారుతో ఢీ కొట్టి వెళ్లిపోయింది. చివరకు తాడ్‌బండ్ సమీపంలో కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో యువతి వివాదానికి దిగడంతో దాదాపు రెండు గంటల పాటు బోయిన్పల్లి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. యువతిపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు న్యూసెన్స్ కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.