పీవీ మార్గ్‌లో అకట్టుకున్న డాగ్ మారథాన్ - తెలంగాణ కానన్ అసోసియేషన్ డాగ్ మారథాన్
🎬 Watch Now: Feature Video
Published : Nov 5, 2023, 5:22 PM IST
Dogs Marathon At PV MARG: మారథాన్ వాక్ మనుషులకే కాదు...పెంపుడు శునకాలకు కూడా ఉంటాయి. ఇలా హైదరాబాద్‌లో పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేసిన డాగ్ మారథాన్ చూపరులను విశేషంగా అలరించింది. తెలంగాణ కానన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెట్ స్టార్ పేరుతో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ డాగిథాన్లో పాల్గొంనేందుకు రకరకాల పెంపుడు కుక్కలను యజమానులు తీసుకొచ్చారు. ఇందులో పాల్గొన్న కుక్కలకు వాకింగ్, రన్నింగ్ పోటీలు నిర్వహించారు.
An Impressive Dog Marathon at HYD: వీటిలో అత్యంత అందంగా ఉన్న కుక్కలకు హ్యాండ్సమ్, ప్రెట్టియస్ట్ డాగ్ అవార్డులను అందజేశారు. డాగిథాన్ పేరిట జరిగిన పోటీలను తిలకించేందుకు పిల్లలు పాటు పెద్దలు ఆసక్తి చూపారు. దేశంలో ఇటీవల జంతువుల మారథాన్ పోటీలు పెరిగాయి. జంతువులతో మారథాన్ నిర్వహించి పిల్లలతో సహా అందరినీ అలరిస్తున్నారు. ఇలాంటి డాగ్ మారథాన్ వల్ల యాజమానులకు వాటితో సమయం గడిపే వీలు కల్పిస్తోంది. ఈ మారథాన్ పోటీలో శునకాలు వాటి అల్లరితో చిన్నపిల్లలను ఆకర్షించాయి. ఇలా కనీసం సంవత్సరంలో ఒక్కసారైన డాగ్ మారథాన్ ఏర్పాటు చేయాలని మారథాన్ వచ్చిన ప్రేక్షకులు విజ్ఞప్తి చేశారు.