లిఫ్ట్‌లో బాలుడిని కరిచిన కుక్క అమ్మతో స్కూల్‌కు వెళ్తుండగా
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఆరేళ్ల బాలుడిని పెంపుడు కుక్క కరిచింది. లిఫ్ట్‌లో బాలుడు తన తల్లితో స్కూల్‌కు వెళ్తుండగా మంగళవారం జరిగిందీ ఘటన. బాలుడిని కుక్క కరిచినప్పుడు శునకం యజమాని కార్తీక్ గాంధీ అక్కడే ఉన్నాడు. బాలుడి చేతికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయని అతడి తల్లి తెలిపింది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఘటానాదృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బాలుడిపై కుక్క దాడిచేసినందుకు గ్రేటర్ నోయిడా అధికారులు శునకం యజమాని కార్తీక్‌కి పది వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ జరిమానాను ఏడు రోజుల్లోగా గ్రేటర్ నోయిడా అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. నోయిడా పరిధిలో కుక్కల దాడులు పెరడం వల్ల జంతు సంరక్షణ చట్టంలో ఇటీవల మార్పులు చేశారు. ఈ చట్టం ప్రకారం తాజాగా జరిమానా విధించారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST