Adipurush Distributors Celebrations : ఆదిపురుష్ విజయం.. టపాసులు కాల్చి డిస్ట్రిబ్యూటర్ల సంబరాలు - Adipurush movie latest news
🎬 Watch Now: Feature Video
Distributors Celebrations Success of Adipurush : ఆదిపురుష్ సినిమా విజయం పట్ల డిస్ట్రిబ్యూటర్లు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్, పీపుల్స్ మీడియా ప్రతినిధులు సంబరాలు చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని పీపుల్స్ మీడియా కార్యాలయం వద్ద టపాసులు కాల్చారు. ఆదిపురుష్ సినిమా తెలుగు రైట్స్‌ను ఆ రాముడే తమతో కొనేలా చేశారని నమ్ముతున్నట్లు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధి శశి తెలిపారు. అన్ని థియేటర్లలో ఈ చిత్రం విజయవంతంగా నడుస్తుందని చెప్పారు. నైజాంలో మొదటి రోజే 1000షోలు నడవటం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. చారిత్రక రామాయణం ఎన్ని సార్లు తీసినా ప్రజలు ఆదరిస్తారన్నారు. సినిమా ఇంత పెద్ద చారిత్రక విజయం సాధించడం వెనుక అందరి కృషి ఉందని పీపుల్స్ మీడియా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచుభట్ల అన్నారు. సినిమా పూర్తైన తర్వాత ప్రభాస్ కలిసినప్పుడు 3డీలో సినిమా అద్భుతంగా ఉందని ఆయన చెప్పారని పేర్కొన్నారు. అభిమానులు రామాయణం లాంటి కథలను.. ప్రేక్షకులు ఇంత ఆదరణ చూపించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇది భారతీయ సినిమా విజయమని వివేక్ కూచుభట్ల వెల్లడించారు.