మది నిండా శివయ్య.. నిప్పులపై నడుస్తూ స్వామి ఊరేగింపు - Yadadri Bhuvanagiri District News
🎬 Watch Now: Feature Video
devotees walk on fire in Mothkur : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. హోళి రోజున (కాముని పున్నమి) స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇవాళ అగ్ని గుండాల కార్యక్రమం పూర్తి చేశారు. దీనికంటే ముందుగా ఆదివారం రోజు రాత్రిపూట మోత్కూరు పురవీధుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఊరేగింపు ఘనంగా జరిపారు. పట్టణంలోని మహిళలు తలంటు స్నానం చేసి తమ ఇళ్ల ముందు కళ్లాపు చల్లి ముగ్గులు వెేసి స్వామివారిని ఘనంగా ఆహ్వనించారు.
సూర్యోదయ సమయంలో ఇవాళ.. ఆలయం ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండాలను తొక్కుకుంటూ స్వామి వారిని ఊరేగిస్తూ భక్తులు ఆలయ ప్రవేశం చేశారు. అప్పుడే ఉదయిస్తున్న సూర్య భగవానుడి తొలి కిరణాలు ఆ దేవుణ్ని తాకుంతుంటే.. భక్తులు ఆ శివపార్వతులను చూసి తన్మయత్వం చెంది మురిసిపోయారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిని చాటుకున్నారు.