తెలంగాణలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కార్ - తొలి అడుగులు ఎటువైపో మరి - నేడు ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
Published : Dec 8, 2023, 9:38 PM IST
Debate on Revanth Reddy Governance Today Prathidwani : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 11మంది మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం మంత్రులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై చర్చించారు. మహిళ ఉచిత ప్రయాణంపై నిర్ణయానికి వచ్చారు. కాగా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించిన హామీలు, మెనిఫెస్టో ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి తొలి అడుగులు వేటిపై అన్న చర్చ జరుగుంది.
మరోపక్క. వీటిని బాలెన్స్ చేసుకుంటూ ఎలా ముందుకు సాగే విషయంలో సీఎంగా రేవంత్‌రెడ్డి ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది? 19 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 64మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలని మినహాయిస్తే 55మంది ప్రతిపక్షపార్టీల సభ్యులు ఉన్నారు. అంత బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు సీఎంగా ఆయన ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది? లోక్‌సభ ఎన్నికలకు మరో 4 నెలలే ఉంది. తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలిపించటాన్ని రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. ఆ దిశగా రాజకీయంగా ఎటువంటి అడుగులు వేసే అవకాశం ఉంది. దీనిపై నేటి ప్రతిధ్వని