విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది : మంత్రి దామోదర - Damodara Prajapalana
🎬 Watch Now: Feature Video
Published : Jan 2, 2024, 7:55 PM IST
Damodara At Narayankhed Prajapalana Program : రాష్ట్రంలో ప్రజలందరికి కావల్సిన ప్రధాన ఆవశ్యకత నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకొస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodara Rajanarsimha) పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వమని స్పష్టం చేశారు. నారాయణఖేడ్‌లోని నిజాంపేట్ మండలం హనుమంత్ రావుపేట్ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వమే ప్రజల ముందుకొచ్చి, ప్రజలతో మమేకమై వారి ఇబ్బందులు, సాధక బాధకాలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ప్రజా పాలన కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు.
Minister Damodar Visit Praja Palana Center : నారాయణ ఖేడ్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని, ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజలకు మాటిచ్చి నిలబెట్టుకునే ప్రభుత్వమని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించి రశీదులు అందజేశారు. ఆరు గ్యారంటీలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మంత్రి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.