Gold seizure at Shamshabad airport : పేస్ట్ రూపంలో.. పొడి రూపంలో... శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ - Gold smuggling at Shamshabad airport
🎬 Watch Now: Feature Video
Customs officials gold seized at Shamshabad airport : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒక మహిళ ప్రయాణికురాలి నుంచి 45.37లక్షల విలువ చేసే 726గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. లోదుస్తుల్లో పేస్టు రూపంలో బంగారంతో పాటు రెండు గొలుసులు మహిళ తీసుకొచ్చిది. మరో మహిళ పిల్లలు తాగే హెల్త్ డ్రింక్ పౌడర్ డబ్బాలో బంగారం పౌడర్‌ను తీసుకొచ్చింది. దీని బరువు 127గ్రాములు ఉండగా.. దీని విలువ సుమారు రూ. 7.77లక్షల విలువ ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. మరో ఇద్దరు మహిళలను కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా ఆగాడం లేదు. అక్రమదారులు గోల్డ్ స్మగ్లింగ్, మాదకద్రవ్యాల రవాణాకు ఎక్కువగా ఈ విమానాశ్రయాన్నే ఎంచుకుంటున్నారు. ఇటీవలే కాలంలో ఇక్కడ జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనం.