ఆత్మస్తుతి పరనింద నుంచి కేటీఆర్ బయటకు రావాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - MLC Jeevan Reddy about Elections
🎬 Watch Now: Feature Video
Published : Jan 12, 2024, 6:27 PM IST
MLC Jeevan Reddy on KTR : మాజీ మంత్రి కేటీఆర్ ఓటమిని అంగీకరించే పరిస్థితిలో లేరని, ఆత్మస్తుతి పరనింద నుంచి కేటీఆర్(KTR) బయటకు రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హితవు పలికారు. లేదంటే బీఆర్ఎస్కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కదని ఆక్షేపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.
Jeevan Redddy Comments on BRS : అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్రచారం తప్ప, పనులు చేయలేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచే వాళ్లం అని గులాబీ నేతలు అంటున్నారన్న ఆయన, అభ్యర్థులను కాదు అధినాయకుడినే మార్చాలని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్‌ను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్‌గా మార్చి నిధులను పక్కదారి మళ్లించి దళిత బంధును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. మిషన్ భగీరథ పెద్ద కుంభకోణమని ఆరోపించిన జీవన్ రెడ్డి, కమీషన్‌ల కోసమే కాళేశ్వరం బోగస్ డిజైన్ చేశారని విమర్శించారు.