Congress Ex MPs Meeting with Madhuyashki : తొలి జాబితాలో టికెట్ రాకపోవడంతో సీనియర్ల అసంతృప్తి.. మధుయాస్కీతో భేటీ - Telangana Assembly Elections 2023 Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 6:03 PM IST

Congress Ex MPs Meeting with Madhuyashki : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో తమ పేర్లు లేకపోవడంతో సీనియర్ నేతలు అలకబూనారు. ఈ క్రమంలోనే హైదరాబాద్​లో పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ (Madhuyashki) ఇంట్లో మాజీ ఎంపీలు బలరాం నాయక్, సురేశ్‌ షెట్కార్‌, రాజయ్య సమావేశమయ్యారు. ఉద్యమం సమయంలో పని చేసిన తమకు తొలి జాబితాలో టికెట్‌ కేటాయించకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Telangana Congress MLA Tickets Disputes : టికెట్‌ విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఎల్బీనగర్‌ టికెట్‌ను మధుయాస్కీ ఆశిస్తుండగా.. హుస్నాబాద్‌ నుంచి పొన్నం ప్రభాకర్‌, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌, నారాయణఖేడ్ నుంచి సురేశ్ షెట్కార్ టికెట్‌ ఆశిస్తున్నారు. మరోవైపు పార్టీ టికెట్ రాని నాయకులు వివిధ రూపాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గాంధీభవన్‌లో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. మేడ్చల్ టికెట్‌ హర్షవర్దన్ రెడ్డికే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. మరో నేత టీపీసీసీ కార్యదర్శి డాక్టర్ కురువ విజయ్ కుమార్ గన్​పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. రేవంత్​రెడ్డి 65 సీట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.