నా కొడుకు జైవీర్‌కు మంత్రి పదవి అడగలేదు : జానారెడ్డి - కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిసిన సీఎం
🎬 Watch Now: Feature Video
Published : Dec 11, 2023, 2:05 PM IST
CM Revanth Reddy Meets Jana Reddy in Hyderabad : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చిన రేవంత్‌కు జానారెడ్డి దంపతులు స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో రేవంత్ రెడ్డిని సత్కరించారు. ఉదయం తన నివాసం నుంచి పార్టీ నేతలు వేం నరేందర్‌రెడ్డి, రోహిణ్ రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్‌లోని జానారెడ్డి నివాసానికి రేవంత్‌రెడ్డి వెళ్లారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక ఆయన సీనియర్ నేతలను మర్యాదపూర్వకంగా కలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జానారెడ్డితో సమావేశమై ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అమలు తీరు వంటి అంశాలపై చర్చలు జరిపారు.
Jana Reddy Latest News : రేవంత్ రెడ్డి సమావేశం అనంతరం జానా రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ పరిపాలనకు అందరు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, నాయకులు ఐకమత్యంగా కలిసి పని చేయాలని సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాభిమానం సొంతం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించానని తెలిపారు. కేసీఆర్‌కు గాయం కావడం చాలా బాధాకరమ, యశోద ఆసుపత్రిలో ఆయణ్ను పరామర్శించడానికి వెళ్లానని చెప్పారు. కేసీఆర్ సాధ్యమైనంత త్వరగా కోలుకుని ప్రతిపక్ష నాయకుడుగా ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు.
"కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తను అన్ని రకాల మంత్రి పదవులు చేశాను. నాకు ఇప్పుడు ఏ మంత్రి పదవి అవసరం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆలోచిస్తాను. నా కుమారుడు జైవీర్‌కు పదవి ఇవ్వాలని అడగలేదు. ప్రస్తుతం అతడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకా జూనియర్ మాత్రమే." - జానారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత